Hyderabad: హైదరాబాదీ బామ్మ జోష్‌.. 93 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ డిగ్రీ! బామ్మ స్పూర్తిదాయక ప్రయాణం ఇదే..

|

Nov 01, 2023 | 12:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన రేవతి తంగవేలు1990లో అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. పదవీవిరమణ అనంతరం ఆమె ఇక్కడితో ఆగిపోవాలని అనుకోలేదు. తన చదువును కొనసాగించింది. ఇంగ్లిష్‌లో పీహెచ్‌డీ చేయాలని భావించింది. అందుకు ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్‌ కూడా పొందింది. ఇంగ్లిష్‌ భాష వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి అంశాలపై రేవతి తంగవేలు పరిశోధనలు చేశారు. విజయవంతంగా పీహెచ్‌డీ డిగ్రీ పూర్తి చేసిన..

Hyderabad: హైదరాబాదీ బామ్మ జోష్‌.. 93 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ డిగ్రీ! బామ్మ స్పూర్తిదాయక ప్రయాణం ఇదే..
Revathi Thangavelu
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 1: ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం (అక్టోబర్ 31) 83వ స్నాతకోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 93 ఏళ్ల బామ్మ పీహెచ్‌డీ పట్టా అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. చదువుకు వయసు అడ్డుకాదని, నేర్చుకోవాలనే జిజ్ఞాస ముందు వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేననే నానుడి ఈ బామ్మ మరో మారు నిరూపించి చూపించింది. వివరాల్లోకెళ్తే..

ఎవరీ రేవతి తంగవేలు..?

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన రేవతి తంగవేలు1990లో అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. పదవీవిరమణ అనంతరం ఆమె ఇక్కడితో ఆగిపోవాలని అనుకోలేదు. తన చదువును కొనసాగించింది. ఇంగ్లిష్‌లో పీహెచ్‌డీ చేయాలని భావించింది. అందుకు ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్‌ కూడా పొందింది. ఇంగ్లిష్‌ భాష వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి అంశాలపై రేవతి తంగవేలు పరిశోధనలు చేశారు. విజయవంతంగా పీహెచ్‌డీ డిగ్రీ పూర్తి చేసిన రేవతి తంగవేలు.. ఉస్మానియా విశ్వవిద్యాలయం తాజాగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం మంగళవారం ఠాగూర్‌ ఆడిటోరియంలో నిర్వహించగా.. అక్కడ ఆమెకు పీహెచ్‌డీ డిగ్రీ పట్టా ప్రధానం చేశారు. ఈ వయసులో 93 ఏళ్ల బామ్మ పీహెచ్‌డీ పట్టా పొంది అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. మనిషి జీవితాంతం నేర్చుకుంటూ, ఎదుగుతూనే ఉంటాడని చదవడానికి, నేర్చుకునేందుకు వయసు అడ్డంకి కాదని చెప్పేందుకు రేవతి తంగవేలు స్పూర్తి దాయక ప్రయాణం ఓ నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం ఆమె సికింద్రాబాద్‌లోని కీస్‌​ఎడ్యుకేషనల్‌ సొసైటీలో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శంతను నారాయణ్‌కు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇప్పటి వరకూ 1,024 మంది పీహెచ్‌డీ పట్టాలు పొందారు. ఓయూ పరిధిలోని ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 58 మందికి గోల్డ్‌ మెడల్స్‌ అందజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.