TS 10th class Prefinal Exams: తెలంగాణ పదో తరగతి విద్యార్ధులకు గమనిక.. మార్చి 1 నుంచి ప్రీ-ఫైనల్‌ పరీక్షలు..

|

Feb 10, 2024 | 4:49 PM

తెలంగాణ పదోతరగతి విద్యార్థులకు మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును ఫిబ్రవరి 9వ తేదీన (శుక్రవారం) విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షలను మధ్యాహ్నం వేళల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మార్చి 1న తెలుగు, మార్చి 2న హిందీ..

TS 10th class Prefinal Exams: తెలంగాణ పదో తరగతి విద్యార్ధులకు గమనిక.. మార్చి 1 నుంచి ప్రీ-ఫైనల్‌ పరీక్షలు..
TS 10th class Exams
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10: తెలంగాణ పదోతరగతి విద్యార్థులకు మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును ఫిబ్రవరి 9వ తేదీన (శుక్రవారం) విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షలను మధ్యాహ్నం వేళల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మార్చి 1న తెలుగు, మార్చి 2న హిందీ, మార్చి 4న ఇంగ్లీష్‌, మార్చి 5న గణితం, మార్చి 6న భౌతిక శాస్త్రం, మార్చి 7న జీవశాస్త్రం, మార్చి 11న సామాజిక శాస్త్ర పరీక్షలను నిర్వహించనున్నారు.

నేటి నుంచి తెలంగాణ పీజీటీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 1,276 పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఈ రోజు, రేపు (ఫిబ్రవరి 10, 11 తేదీల్లో) ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నారు. ఆయ సబ్జెక్టుల వారీగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన వివరాలు, అర్హత పొందిన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. దీనితోపాటు ఎంపికైన అభ్యర్ధులు ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాలంటూ బోర్డు అధికారులు ఒక్కక్కరికీ వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్‌లు పంపించింది. వారికి ఫోన్లు చేసి కూడా సమాచారం అందించారు. మరోవైపు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ పోస్టులకు, అలాగే పాఠశాలల్లోని ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులకు ఈ రోజు (ఫిబ్రవరి 10) నుంచి డెమో తరగతులు గురుకుల నియామక బోర్డు నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఎక్కడెక్కడ జరుగుతుందంటే..

  • పీజీటీ హిందీ పోస్టులకు ఫిబ్రవరి 10న ఉదయం 9 గంటల నుంచి ఎల్బీనగర్‌ మెట్రోపిల్లర్‌ 1570 వద్ద ఉన్న ఎస్సీ గురుకుల మహిళా న్యాయ కళాశాల ఆవరణలో జరుగుతుంది.
  • పీజీటీ సోషల్‌ స్టడీస్‌, మేథమెటిక్స్‌, బయాలజికల్‌ సైన్స్‌ పోస్టులకు ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 9 గంటల నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ – 10లోని బంజారాభవన్‌లో జరుగుతుంది.
  • పీజీటీ తెలుగు, ఆంగ్ల భాషా పోస్టులకు ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 9 గంటల నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్ – 10లోని కుమురంభీం ఆదివాసీ భవన్‌లో జరుగుతంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.