
హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరో వారంలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు పాఠశాల ప్రిన్సిపల్ నుంచి లేదా వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 3 నుంచి 13 వరకు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42,832 మంది విద్యార్థులు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ పదో తగరతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2025 పరీక్షల హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,07,107 మంది విద్యార్ధులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయగా.. అందులో 4,60,519 మంది అంటే 92.78 శాతం మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.