ECIL Recruitment 2021: కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ చేసిన వారికి హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

|

Mar 16, 2021 | 12:21 AM

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిటిటెడ్‌ (ECIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెక్నికల్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు..

ECIL Recruitment 2021: కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ చేసిన వారికి హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
Ecil Jobs
Follow us on

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిటిటెడ్‌ (ECIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెక్నికల్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

కాంట్రాక్ట్‌ పోస్టులే అయినా..

నిజానికి ఈ పోస్టులను ఈసీఐఎల్‌ ఏడాది గడువు కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకుంటోంది. అయితే ప్రాజెక్ట్‌ అవసరాలకు అనుగుణంగా పొడగించే అవకాశాలున్నాయి.

మొత్తం ఖాళీలు..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం తొమ్మిది ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా 8 మంది టెక్నికల్‌ ఆఫీసర్‌, ఒక సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఏ-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

దరఖాస్తు చివరితేది..

ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. మార్చి 18 చివరి తేదీగా ప్రకటించారు. ఇక నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు.. http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి.

విద్యార్హతలు..

టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు కంప్యూటర్‌ సైన్స్‌ (CSE), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో (IT) ఇంజనీరింగ్‌ డిగ్రీ ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుకు డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత అయి ఉండాలి.

వయోపరిమితి, జీత భత్యాలు..

టెక్నికల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 ఏళ్లు, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఏ పోస్టుకు 25 ఏళ్లు ఉండాలి. ఇక జీతభత్యాల విషయానికొస్తే.. టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు రూ.20,200 లభిస్తుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అనంతరం ‘కెరీర్స్‌’ సెక్షన్‌లో ‘e‐Recruitment’పై క్లిక్‌ చేయాలి. అనంతరం అందులో నోటిఫికేషన్‌ సెలకెట్‌ చేసి ‘Apply for Various Posts’ పైన క్లిక్ చేసి సంబంధిత వివరాలు అందించాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

Also Read: NEET 2021 Latest News : నీట్ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకోడానికి విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవే..!

Warangal Kendriya Vidyalaya: నిరుద్యోగులకు శుభవార్త.. వరంగల్‌ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

CET Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష.. సెప్టెంబర్‌లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్..