Jobs in IT Companies: దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా ప్రారంభం నాటి నుంచి నష్టాల బారిన కూరుకుపోయిన ఐటీ కంపెనీలు.. కాస్త పుంజుకున్నప్పటికీ.. సెకండ్ వేవ్ దెబ్బతీసింది. దీనివల్ల ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు లేక నిరోద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో.. భారతీయ ఐటీ సంస్థలు నియామక కార్యకలాపాలను మెరుగుపర్చాయి. దీనిలో భాగంగా భారతదేశపు అతిపెద్ద ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ (ఐటి) సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు భారీగా నియమకాలు చేపట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 1లక్షకు పైగా నియామకాలు చేపట్టేందుకు సంసిద్ధమయ్యాయి. అయితే.. ఆయా సంస్థలన్నీ తమ త్రైమాసిక ఆదాయాల నవీకరణలో భాగంగా పేర్కొన్నాయి. కరోనా ఉధృతి నెలకొన్నిప్పటికీ.. వృద్ధి వైపు పయనిస్తూ కంపెనీలు భారీ నియామకాలు చేపట్టడం విశేషం. కంపెనీల వారీగా నియామకాలు ఇప్పుడు చూద్దాం..
టీసీఎస్ నియామకాలు..
దేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీ టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో పలు క్యాంపస్‌ల నుంచి 40,000 మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు తెలిపింది. 5 లక్షల మందికి పైగా ఉద్యోగులతో ప్రైవేటు రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న టీసీఎస్ 2020లో 40,000 మంది గ్రాడ్యుయేట్లను క్యాంపస్‌ల నుంచి నియమించుకుంది. మరిన్ని నియామకాలను చేపట్టనున్నట్లు టీసీఎస్ అధికారి మిలింద్ లక్కాడ్ గత వారం పేర్కొన్నారు. కరోనావైరస్ మహమ్మారికి సంబంధించిన ఆంక్షలు ఉన్న సమయంలోనే గతేడాది మొత్తం 3.60 లక్షల మంది ప్రవేశ పరీక్ష కోసం హాజరయ్యారని తెలిపారు.
ఇన్ఫోసిస్ నియామకాలు..
ఇన్ఫోసిస్ ప్రపంచవ్యాప్తంగా 35,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను 2021-22 ఆర్థిక సంవత్సరంలో నియమించనున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇటీవల వెల్లడించారు. మార్చి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌లో 2.59 లక్షలు ఉండగా..జూన్‌లో ఉద్యోగుల సంఖ్య 2.67 లక్షలకు చేరిందన్నారు.
విప్రో నియామకాలు..
ఐటీ సంస్థ విప్రో ఉద్యోగుల సంఖ్యను 2,00,000 మార్క్ దాటింది. ప్రస్తుత హెడ్‌కౌంట్ 209,890 ఉన్నట్లు కంపెనీ మొదటి త్రైమాసికంలో వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో 10,000 మంది నియామకాలు చేపట్టగా.. దాదాపు 2,000 మంది ఫ్రెషర్లు ఆన్‌బోర్డ్‌లో ఉన్నారని తెలిపింది. కాగా ఈ ఏడాది 30,000 ఆఫర్ లెటర్లను కంపెనీ విడుదల చేస్తుందని వాటిలో.. 22,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు విప్రో పేర్కొంది.
Also Read: