TMC Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో టాటా మెమోరియల్ సెంటర్‌లో 164 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా..

|

Nov 18, 2022 | 7:07 AM

టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోనున్న హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో.. 164 మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, టెక్నికల్ ఆఫీసర్‌, టెక్నికల్ కోఆర్డినేటర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన..

TMC Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో టాటా మెమోరియల్ సెంటర్‌లో 164 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా..
Tata Memorial Centre Recruitment 2022
Follow us on

టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోనున్న హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో.. 164 మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, టెక్నికల్ ఆఫీసర్‌, టెక్నికల్ కోఆర్డినేటర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/బీడీఎస్‌/ఎమ్‌డీఎస్‌/ఎమ్‌పీహెచ్‌/ఎమ్‌సీఏ/బీఏఎమ్‌ఎస్‌/బీహెచ్‌ఎమ్‌ఎస్‌/డిప్లొమా/జీఎన్‌ఎమ్‌/బీఎస్సీ నర్సింగ్/బీఫార్మసీ/డీఫార్మసీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌లో నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 14వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన అభ్యర్ధులకు పోస్టును బట్టి నెలకు రూ.10,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 12
  • టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు: 2
  • టెక్నికల్ కోఆర్డినేటర్ (డేటా) పోస్టులు: 1
  • టెక్నికల్ కోఆర్డినేటర్ (మెడికల్) పోస్టులు: 1
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 38
  • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు: 2
  • రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ (HPV) పోస్టులు: 1
  • నర్స్ పోస్టులు: 24
  • పేషెంట్ అసిస్టెంట్ పోస్టులు: 38
  • ఫార్మసిస్ట్ పోస్టులు: 6
  • మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (క్యాన్సర్ స్క్రీనింగ్) పోస్టులు: 38

అడ్రస్:

Homi Bhabha Cancer Hospital And Research Centre, Shri Krishna Medical College And Hospital Campus, Umanagar, Muzaffarpur (Bihar) – 842004.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.