TMC Recruitment: విశాఖ‌ప‌ట్నం టీఎంసీలో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌కుపైగా జీతం పొందే అవకాశం..

|

Jan 20, 2022 | 6:03 PM

TMC Recruitment: టాటా మెమోరియల్‌ సెంటర్‌ (TMC)-హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్ అండ్‌ రిసెర్చ్ సెంట‌ర్‌ (హెచ్‌బీసీహెచ్‌&ఆర్‌సీ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ విశాఖ‌ప‌ట్నంలో..

TMC Recruitment: విశాఖ‌ప‌ట్నం టీఎంసీలో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌కుపైగా జీతం పొందే అవకాశం..
Follow us on

TMC Recruitment: టాటా మెమోరియల్‌ సెంటర్‌ (TMC)-హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్ అండ్‌ రిసెర్చ్ సెంట‌ర్‌ (హెచ్‌బీసీహెచ్‌&ఆర్‌సీ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ విశాఖ‌ప‌ట్నంలో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో గైనక్ అంకాల‌జీ, పాథాల‌జీ, స‌ర్జిక‌ల్ అంకాల‌జీ విభాగాల్లో ఉన్న సీనియ్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 1,01,000 జీతంగా చెల్లిస్తారు. అభ్య‌ర్థులు విశాఖ‌పట్నంలోని హోమీ బాబా క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ అండ్ రిసెర్చ్ సెంట‌ర్‌లో ప‌ని చేయాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణకు 30-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్‌ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..

Rajinikanth: నా అల్లుడు మంచివాడంటూ ధనుష్‌పై రజనీకాంత్ పొగడ్తల వర్షం.. వీడియో వైరల్..

ashu reddy: తన క్యూట్ స్టిల్స్ తో ఫ్యాన్స్ మనసులు దోచుకుంటున్న అషు రెడ్డి