SVIMS: తిరుపతి స్విమ్స్‌లో టీచింగ్ పోస్టులకు అప్లై చేశారా.? నేడే చివరి తేదీ. నెలకు రూ. 2 లక్షల జీతం వచ్చే ఉద్యోగం

|

May 08, 2023 | 7:09 AM

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (SVIMS)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో (మే 8) ముగియనున్న నేపథ్యంలో...

SVIMS: తిరుపతి స్విమ్స్‌లో టీచింగ్ పోస్టులకు అప్లై చేశారా.? నేడే చివరి తేదీ. నెలకు రూ. 2 లక్షల జీతం వచ్చే ఉద్యోగం
SVIMS Jobs
Follow us on

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (SVIMS)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో (మే 8) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 142 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* జనరల్‌ సర్జరీ, అనాటమీ, క్లినికల్‌ వైరాలజీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సైకియాట్రీ, యూరాలజీ, రేడియాలజీ, పెడియాట్రిక్స్‌, రోమటాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను రిజిస్ట్రార్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) అలిపిరి రోడ్, తిరుపతి, తిరుపతి జిల్లా – 517 502 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 67,700 నుంచి రూ. 2,11,300 వరకు చెల్లిస్తారు.

* ఆఫ్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (మే 08వ) ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..