SSC Exam dates 2022: ఎస్సెస్సీ 2022 CGL, CHSL టైర్ 1 పరీక్షల తేదీలు విడుదల.. హాల్ టికెట్ల జారీ ఈ తేదీల్లోనే..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2021, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ 2021 పరీక్షలకు సంబంధించిన టైర్‌ I షెడ్యూల్‌ విడుదలైంది..

SSC Exam dates 2022: ఎస్సెస్సీ 2022 CGL, CHSL టైర్ 1 పరీక్షల తేదీలు విడుదల.. హాల్ టికెట్ల జారీ ఈ తేదీల్లోనే..
Ssc Cgl Tier 1 Dates

Updated on: Mar 11, 2022 | 8:36 AM

SSC CGL& CHSL Tier 1 Exam Dates 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2021, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ 2021 పరీక్షలకు సంబంధించిన టైర్‌ I షెడ్యూల్‌ విడుదలైంది. SSC CGL, CHSL టైర్ 1 2021 పరీక్ష తేదీలను అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో చెక్‌ చేసుకోవచ్చు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 1 ఎగ్జాం 2021-22 వచ్చే నెల అంటే ఏప్రిల్‌ 11 నుంచి 21 తేదీల మధ్య జరుగుతుంది. ఇక ఎస్సెస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ టైర్ 1 పరీక్ష 2021-22.. మే 24 నుంచి జూన్‌ 10 వరకు సెషన్ల వారీగా జరుగుతుంది. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు (admit card) పరీక్షలకు 10 నుంచ 15 రోజులలోపు వెలువడుతుంది. టైర్ 1 పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో జరుగుతాయి. ఇక టైర్‌ II పరీక్షలు డిస్ర్కిప్టివ్‌ విధానంలో జరగనున్నాయి. స్కిల్ టెస్ట్‌కు 15 నిముషాలు, టైపింగ్‌ టెస్ట్‌కు 10 నిముషాల సమయం కేటాయిస్తారు.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

IIT Indore Faculty Jobs 2022: పీహెచ్‌డీ అర్హతతో.. ఐఐటీ ఇండోర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు..దరఖాస్తు ఇలా..