SSC Stenographer Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి (Stenographer Grade C and D Posts)లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక రెండు రోజులే మిగిలున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు సెప్టెంబర్ 5, 2022వ తేదీ రాత్రి 11 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము సెప్టెంబర్ 6, 2022వ తేదీలోపు చెల్లించవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు జనవరి 1, 2022 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితి సడలింపులో రిజర్వేషన్ వర్తిస్తుంది. ఐతే దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/వికలాంగులు/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మొత్తం 200 మార్కులకు గానూ 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.