SSC Results: ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాల తేదీలు విడుదల.. సీజీఎస్‌ఎల్, సీజీఎల్ రిజల్ట్స్ ఎప్పుడంటే!

| Edited By: Ravi Kiran

Feb 05, 2022 | 1:24 PM

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన వివిధ పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటన తేదీల (SSC Result dates)ను అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా విడుదల చేసింది...

SSC Results: ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాల తేదీలు విడుదల.. సీజీఎస్‌ఎల్, సీజీఎల్ రిజల్ట్స్ ఎప్పుడంటే!
Ssc
Follow us on

SSC Result Calendar 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన వివిధ పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటన తేదీల (SSC Result dates)ను అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా విడుదల చేసింది. కమీషన్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఈ కింద తెలిపిన తేదీల్లో ఫలితాలు విడుదలవ్వనున్నాయి. ఏ యే తేదీల్లో ఫలితాలు విడుదలవుతాయో ఆ వివరాలు తెలుసుకోండిలా..

  • కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) స్థాయి (CHSL) పరీక్ష 2019 (స్కిల్ టెస్ట్), మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 (పేపర్-I), జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్‌లు) పరీక్ష 2020 (పేపర్-II) ఫలితాలు ఫిబ్రవరి 28, 2022న వెలువడనున్నాయి.
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, డీ పరీక్ష 2019 (స్కిల్ టెస్ట్) ఫలితాలు మార్చి 10, 2022న విడుదలవుతాయి.
  • సీఏపీఎఫ్ కానిస్టేబుల్ (జీడీ), ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లోని రైఫిల్‌మాన్ (జీడీ) పరీక్ష 2021 ఫలితాలు ఏప్రిల్ 15, 2022న విడుదలవుతాయి.
  • కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్ష 2020 (టైర్-II) ఫలితాలు ఏప్రిల్ 30, 2022న విడుదలవుతాయి.

ఆయా పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/లో ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.

Also Read:

ECL Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్! ఇంటర్ అర్హతతో.. కోల్ ఇండియా లిమిటెడ్‌లో 313 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల