స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ‘కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2024’కు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ కింద మొత్తం 312 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 25, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీ (హిందీ/ ఇంగ్లిష్)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. అలాగే హిందీ/ ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేషన్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. లేదా హిందీ/ ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీలో అర్హతతోపాటు తగు అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 25, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్/ సీనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ.44900 నుంచి రూ.1,42,400 వరకు, ఇతర పోస్టులకు రూ.35400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు.
మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్‌లో జరుగుతుంది. జనరల్ హిందీ నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి. మొత్తం 2 గంటల వ్యవధిలో పరీక్ష రాయాలి. పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. ఇది కూడా 2 గంటలు ఉంటుంది.