SSC GD Constable: భారీగా కానిస్టేబుల్ కొలువులకు నోటిఫికేషన్‌.. ఆగస్టు 27న ప్రకటన

|

Aug 08, 2024 | 12:11 PM

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) నియామకాల భర్తీకి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈసారి వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (జీడీ) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సన్నద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఎస్సెస్సీ 2024-25 వార్షిక క్యాలెండర్‌ ప్రకారం ఆగస్టు 27వ తేదీన నోటిఫికేషన్‌..

SSC GD Constable: భారీగా కానిస్టేబుల్ కొలువులకు నోటిఫికేషన్‌.. ఆగస్టు 27న ప్రకటన
SSC GD Constable Jobs
Follow us on

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) నియామకాల భర్తీకి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈసారి వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (జీడీ) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సన్నద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఎస్సెస్సీ 2024-25 వార్షిక క్యాలెండర్‌ ప్రకారం ఆగస్టు 27వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆ వెనువెంటనే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ చేపట్టి, అక్టోబర్‌ 5వ తేదీతో ముగియనుంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగుతాయి. కాగా గతేడాది 46,617 ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలోనే పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

ఈ పోస్టులకు పదో తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీ మీటర్లు, మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెంటీ మీటర్లకు తగ్గకుండా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్‌ కింద బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

‘ప్రతి తరగతికి ఒక్కో టీచర్‌ ఉండేలా సర్దుబాటు చేయాలి’ మంత్రి లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులతో ఆగస్టు 6న మంత్రి నారా లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి తరగతికి ఒక్కో టీచర్‌ ఉండేలా సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించాలని నిర్ణయించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మైనర్‌ మాధ్యమ విద్యార్థులకు ఆంగ్లంతోపాటు వారి మాతృభాషపైనా పట్టు సాధించేలా పాఠ్యాంశాలను రూపకల్పన చేయాలని అన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలన్నారు. కేజీబీవీల్లో బోధన పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని, ‘ప్రతి తరగతికి ఒక్కో టీచర్‌ ఉండేలా సర్దుబాటు చేయాలని అధికారులను సూచించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.