
నిరుద్యోగులు అలర్ట్ అవ్వండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంకా ఒక్కరోజే టైమ్ ఉంది. కేంద్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 3131 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్లికేషన్ గడువు శుక్రవారంతో ముగియనుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలు, ట్రిబ్యునళ్లలో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో పాసైన వారు అర్హులు. కొన్ని శాఖల్లో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో ఎంపీసీ చేసి ఉండాలి. మిగితా వివరాలను అధికారిక వెబ్ సైట్ చూడలని ఎస్ఎస్‌సీ సూచించింది.
సంస్థ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
ఉద్యోగాల సంఖ్య: 3131
పరీక్ష: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL)
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 18-07-2025
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/login ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..