
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) 2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో పలు పోస్టుల భర్తీకి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14,582 ఖాళీలను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేనుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 4, 2025వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర విషయాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాంలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్‌లో గణితం 60 శాతం మార్కులుతోపాసై ఉండాలి. లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా అర్హులే. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 01, 2025 తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 04 జూలై, 2025గా నిర్ణయించారు.
ఇక దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు/ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫీజు చెల్లింపులకు 5 జూలై, 2025 వరకు అవకాశం ఉంటుంది. టైర్-I, టైర్-II టెస్ట్‌లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. టైర్-I పరీక్ష ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 30 వరకు ఉంటుంది. టైర్ 2 పరీక్ష డిసెంబర్ 2025లో ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.రూ.25,500 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఎస్సెస్సీ సీజీఎల్ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.