
నిరుద్యోగులకు శుభవార్త. జిల్లా కోర్టు లోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఖాళీగా ఉన్న కొన్ని ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. మొత్తం నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. ఇందులో రికార్డు అసిస్టెంట్ విభాగంలో రెండు (ఓసి-1, ఎస్సీ-1), డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఒకటి(OC), ఫ్రంట్ ఆఫీస్ కో – ఆర్డినేటర్ పోస్టు ఒకటి(OC)చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.23,120 నుండి రూ.89,720 వరకు వేతన శ్రేణి వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన ఫారమ్‌లను ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే ‘చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శ్రీకాకుళం’ చిరునామాకు పంపాలని అధికారులు స్పష్టం చేశారు.
విద్యార్హత, వయో పరిమితి..
డేటా ఎంట్రీ ఆపరేటర్,ఫ్రంట్ ఆఫీస్ కో – ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేన్ పూర్తి చేయటంతో పాటు M.S. ఆఫీస్ లేదా లిబ్రో ఆఫీస్ అండ్ వెబ్ బ్రౌజింగ్ లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.ఇక రికార్డు అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు SSC పాసై ఉండాలి. పై విద్యార్హతలు ఉండి 18 ఏళ్ళు నుండి 42 ఏళ్ళ మధ్య వయస్కులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. SC,ST,BC,EWS, దివ్యాoగులు,ఎక్స్ సర్వీస్ మన్ లకు గరిష్ట వయో పరిమితి మరి కొన్నేళ్లు పొడిగిస్తూ సడలింపు ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా కోర్టు వెబ్‌సైట్ (srikakulam.dcourts.gov.in) ను
సంప్రదించగలరు. మరెందుకు ఆలస్యం అర్హత,ఆసక్తి ఉన్న శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఆల్ ది బెస్ట్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..