Konda Laxman: కొండా లక్ష్మణ్‌ హార్టికల్చరల్ యూనివ‌ర్సిటీ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా.? రేపే చివ‌రి తేదీ..

|

Jun 19, 2021 | 6:14 AM

Konda Laxman bapuji Horticulture university: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హార్టీక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. సిద్ధిపేట జిల్లాలో రాజీవ్‌రహ‌దారిపై ములుగు గ్రామానికి స‌మీపంలో ఉన్న...

Konda Laxman: కొండా లక్ష్మణ్‌ హార్టికల్చరల్ యూనివ‌ర్సిటీ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా.? రేపే చివ‌రి తేదీ..
Konda Laxamn Bapuji
Follow us on

Konda Laxman bapuji Horticulture university: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హార్టీక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. సిద్ధిపేట జిల్లాలో రాజీవ్‌రహ‌దారిపై ములుగు గ్రామానికి స‌మీపంలో ఉన్న ఈ యూనివ‌ర్సిటీలో కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 07 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (20-06-2021) ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ఫామ్‌ మేనేజర్ (01), ల్యాబ్‌ అసిస్టెంట్ (01), స్టెనోగ్రాఫర్ (01), డ్రైవర్ (02), అటెండర్ (02) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఫామ్ మేనేజ‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. హార్టిక‌ల్చ‌ర్‌/అగ్రికల్చర్ విభాగాల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 34,800 వరకు చెల్లిస్తారు.

* ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. హార్టిక‌ల్చ‌ర్‌/అగ్రికల్చర్ విభాగాల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారికి నెల‌కు రూ. 34,800 వ‌ర‌కు చెల్లిస్తారు.

* స్టెనో గ్రాఫ‌ర్ ఉద్యోగానికి ద‌రఖాస్తు చేసుకునే వారు బ్యాచిల‌ర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 20,200 వరకు జీతంగా చెల్లిస్తారు.

* డ్రైవ‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు జీతంగా నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.

* అటెండర్ ఉద్యోగానికి ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఏడో త‌ర‌గ‌తి పాస్ అయ్యి ఉండాలి. ఎంపికైన వారికి నెల‌కు రూ. 20,200 వరకు చెల్లిస్తారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* పైన తెలిపిన పోస్టుల‌ను అనుస‌రించి రాత ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు రేపే (20-06-2021) చివరి తేదీ.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Contract Lecturers : కాంట్రాక్ట్‌ లెక్చరర్ల కళ్లల్లో ఆనందం.. కేసీఆర్ సర్కారు జీతాలు పెంచడంతో పరవశం

Concrete mixer lorry : కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ బీభత్సం.. ఒక ట్రాక్టర్, రెండు బైక్ లను ఢీకొనడంతో నలుగురు మృత్యువాత

ecalcus app : ఉచిత ఆన్ లైన్ టీచింగ్ యాప్ ‘ఇకాల్కస్’ ను ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి