Railway Jobs 2021: రైల్వేలో 3378 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జూన్‌ 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Railway Jobs 2021: ఈ మధ్య కాలంలో రైల్వేలో చాలా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ అవుతోంది. ఇప్పటికే ఎన్నో నోటిఫికేషన్‌ విడుదల చేసిన రైల్వే.. తాజాగా సదరన్‌..

Railway Jobs 2021: రైల్వేలో 3378 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జూన్‌ 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Updated on: May 31, 2021 | 2:13 PM

Railway Jobs 2021: ఈ మధ్య కాలంలో రైల్వేలో చాలా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ అవుతోంది. ఇప్పటికే ఎన్నో నోటిఫికేషన్‌ విడుదల చేసిన రైల్వే.. తాజాగా సదరన్‌ రైల్వేలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 3378 అప్రెంటీస్‌పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. పెరంబూర్, పొడనూర్‌లోని వర్క్‌షాప్‌లల్లో ఈ ఈ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు జూన్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఉద్యోగ పోస్టులు :

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, వెల్డర్, టర్నర్ లాంటి పోస్టులను భర్తీ కానున్నాయి. పదో తరగతితో పాటు ఐటీఐ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు జూన్‌ 1న విడుదలవుతుంది.

కాగా, ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 జూన్ 30 చివరి తేదీ. https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ జూన్ 1న యాక్టివేట్ అవుతుంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థుల వయస్సు 24 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇవీ కూడా చదవండి:

IIT HYD: ఐఐటీ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

CBSE Exams: సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కొన‌సాగుతోన్న సందిగ్ధ‌త‌… జూన్ 3న నిర్ణ‌యం తెల‌ప‌నున్న కేంద్రం..