రైల్వే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే శాఖ. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్తులను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే లోని 35 ఎస్టాబ్లిష్‌మెంట్‌లలోని 11 ట్రేడ్‌లలో ఈ 4,103 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారం గా ఎంపిక చేస్తారు.
వయసు: 24 ఏళ్లు మించకూడదు.
అర్హత: పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో..
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజీ, ఇంటర్న్‌షిప్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి
దరఖాస్తులకు ప్రారంభ తేది: అక్టోబర్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి
దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 3
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: scr.indianrailways.gov.in
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 3 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడండి.
ఇవి కూడా చదవండి: Badvel By Election: బద్వేల్ బరిలో బీజేపీ లిస్ట్.. ఆ ఐదుగురి పేర్లపై అధిష్టానం ఫోకస్..