South Central Railway Jobs: సౌత్ సెంట్ర‌ల్ రైల్వే హైద‌రాబాద్ డివిజ‌న్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

|

May 24, 2021 | 3:54 PM

South Central Railway Recruitment 2021: క‌రోనా మ‌హ‌మ్మారిని అంత‌మొందించేందుకు అన్ని ప్ర‌భుత్వ సంస్థ‌లు ఏక‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కొవిడ్ బాధితుల‌కు వైద్య సేవ‌ల‌ను అందించే క్ర‌మంలో...

South Central Railway Jobs: సౌత్ సెంట్ర‌ల్ రైల్వే హైద‌రాబాద్ డివిజ‌న్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..
South Cenral Railwaay
Follow us on

South Central Railway Recruitment 2021: క‌రోనా మ‌హ‌మ్మారిని అంత‌మొందించేందుకు అన్ని ప్ర‌భుత్వ సంస్థ‌లు ఏక‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కొవిడ్ బాధితుల‌కు వైద్య సేవ‌ల‌ను అందించే క్ర‌మంలో భారీ ఎత్తున కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగుల‌ను తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా సౌత్ సెంట్ర‌ల్ రైల్వే హైద‌రాబాద్ డివిజ‌న్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా ప‌లు విభాగాల్లో మొత్తం 80 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు, అర్హ‌త‌లు..

* స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ (03) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఎమ్‌బీబీఎస్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో పీజీ పూర్తి చేసి ఉండాలి. అభ్య‌ర్థులు 22-05-2021 నాటికి 53 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎంపికైన వారికి రూ.95,000 జీతం అందిస్తారు.

* జీడీఎమ్ఓ (కాంట్రాక్ట్ మెడిక‌ల్ ప్రాక్టిషిన‌ర్) – 16 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు ఎమ్‌బీబీఎస్ డిగ్రీని పూర్తి చేసిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థుల వ‌య‌సు 22-05-2021 నాటికి 53 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎంపికైన వారికి రూ. 75,000 జీతంగా అందిస్తారు.

* న‌ర్సింగ్ సూప‌రిండెంట్ (స్టాఫ్ న‌ర్స్‌) – 31 పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్‌లో మూడేళ్ల కోర్సు చేసు ఉండాలి. లేదా బీఎస్‌సీ (న‌ర్సింగ్) పూర్తి చేయాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 22-05-2021 నాటికి 22 నుంచి 33 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి. జీతం రూ. 44,900 గా ఉంటుంది.

* హాస్పిట‌ల్ అటెండెంట్ (26) పోస్టుల‌కు ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ పూర్తి చేయాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 22-05-2021 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి. జీతం రూ. 18,000గా ఉంటుంది.

* ఫార్మ‌సిస్ట్ (02) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సైన్స్ విభాగంలో 10+2 పూర్తి చేయాలి. అలాగే ఫార్మ‌సీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. లేదా బీ. ఫార్మాలో బ్యాచిల‌ర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అభ్య‌ర్థులు 22-05-2021 నాటికి 20 నుంచి 33 ఏళ్లు ఉండాలి.

* హెల్త్ అండ్ మ‌లేరియా ఇన్‌స్పెక్ట‌ర్ (01):
అర్హ‌త‌: కెమిస్ట్రీ ప్ర‌ధాన స‌బ్జెక్ట్‌తో బీఎస్‌సీ పూర్తి చేయాలి.
వ‌య‌సు: 22-05-2021 నాటికి 20 నుంచి 33 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
జీతం: 35,400/-

* ల్యాబ్ అసిస్టెంట్ (01)
అర్హ‌త‌: 10+2 (సైన్స్‌)తో పాటు మెడిక‌ల్ లాబొరేట‌రీ టెక్నాల‌జీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వ‌య‌సు: 22-05-2021 నాటికి 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి.
జీతం: 21,700/-

ముఖ్య‌మైన విష‌యాలు…

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ ద్వారా మీ పూర్తి వివ‌రాల‌ను పంపించాల్సి ఉంటుంది.

* ఇందులో భాగంగా పూర్తి వివ‌రాల‌తో కూడిన అప్లికేష‌న్ ఫామ్‌తో పాటు విద్యార్హ‌త‌లు, ఎస్ఎస్‌సీ మెమో, ఎక్స్‌పీరియ‌న్స్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను స్కాన్ చేసి.. contractmedicalhyb@gmail.com పంపించాలి.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 29-05-2021 నిర్ణ‌యించారు.

* షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థులకు 04-06-2021, 05-06-2021 ఉద‌యం 11 గంట‌ల నుంచి ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ చేప‌ట్ట‌నున్నారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: తెలంగాణ రైతు గోస పేరుతో బీజేపీ పోరు దీక్ష… రాష్ట్ర సర్కార్‌పై మండిపడిన బండి సంజయ్

WUHAN LABORATORY: చైనా మెడకు కరోనా ఉచ్చు.. వూహన్ ల్యాబే వైరస్ జన్మస్థలం! అమెరికా చేతిలో కీలక ఆధారం

Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..