SCCL Recruitment: సింగరేణిలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. నోటిఫికేషన్‌లో భాగంగా 1300 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1300 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
* ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల అభ్యర్థులను 95 శాతం, మిగతా 5 శాతం నాన్ లోకల్ అభ్యర్థులను తీసుకోనున్నారు.
* వారసత్వ ఉద్యోగాలకు అర్హులైన వారికి సంస్థ కుటుంబాలకు చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ NAPS కొత్త పోర్టల్ www.apprenticeshipindia.org లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అనంతరం SCCL వెబ్‌సైట్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం తమ పేర్లను నమోదు చేయాలి.
* చివవరిగా అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ అవుట్ హార్డ్ కాపీలను ఏదైనా ఏరియా MVTCలలో సమర్పించాలి.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 25న మొదలై ఆగస్టు 08 తేదీతో ముగియనుంది.
* జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్‌సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు నిండకూడదు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* అప్లికేషన్ ఫామ్ కోసం క్లిక్ చేయండి..