Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ బోర్డు కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్, అనెస్థీటిస్ట్, స్టాఫ్ నర్సు ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్, డీఏ/డీజీవో/ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత పత్రాలతో నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
* ఫిబ్రవరి 4న నిర్వహించనున్న ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుంచి రూ. 1,20,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
* వాక్ ఇన్ ఇంటర్వ్యూలను సర్ధార్ వల్లభాయ్ పటేల్, కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ బొల్లారం, సికింద్రాబాద్ అడ్రస్‌లో నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గమనిక.. UAN పాస్‌వర్డ్ మర్చిపోయారా.. ఇలా చేయండి..?