వెస్ట్రన్ రైల్వే పరిధిలోని డివిజన్/ వర్క్‌షాప్‌లలో 2023-24 సంవత్సరానికి 3,624 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షలేకుండా విద్యార్హతలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫిట్టర్, వెల్డర్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), పీఏఎస్‌ఎస్‌ఏ, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ- మెకానిక్), పెయింటర్, డీజిల్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి.
పదోతరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 26, 2023వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జులై 26, 2023. జనరల్ కేటగిరికి చెందిన వారు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. మిగతావారు చెల్లించాల్సిన అవసరం లేదు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.