SBI SO Recruitment 2024: ఎలాంటి రాత పరీక్షలేకుండా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు

|

Jun 09, 2024 | 2:58 PM

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్‌ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ కింద ఉన్న పలు బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా..

SBI SO Recruitment 2024: ఎలాంటి రాత పరీక్షలేకుండా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు
SBI SO Recruitment 2024
Follow us on

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్‌ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ కింద ఉన్న పలు బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-II)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-స్కేల్ II కింద ఈ 150 పోస్టులను భర్తీ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఈ పోస్టులకు అభ్యర్దులను ఎంపిక చేయనున్నారు.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్‌ ఫారెక్స్‌ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. అలాగే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 27, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ దరఖాస్తు, రుసుం చెల్లింపులు రెండూ జూన్‌ 07, 2024వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఉద్యోగం పొందిన వారు హైదరాబాద్, కోల్‌కతాలలో పని చేయవల్సి ఉంటుంది. నెలకు రూ.48,170 నుంచి రూ.69,810వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇతర పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.