SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఈ సంస్థ ముంబైలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోంది. రెగ్యులర్ విధానంలో స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులను భర్తీచ ఏయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (12-06-2022) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఏజీఎం (04), మేనేజర్ (02), డిప్యూటీ మేనేజర్ (26) ఖాళీలు ఉన్నాయి.
* ఐటీ(టెక్నికల్ ఆపరేషన్స్, ఇన్‌బౌండ్ ఇంజనీర్, ఔట్‌బౌండ్ ఇంజనీర్, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్), నెట్‌వర్క్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్, స్టాటిస్టీషియన్) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (12-06-2022) ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..