State Bank of India: రాత పరీక్షలేకుండా ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా జాబ్ ..

|

Mar 04, 2023 | 1:46 PM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా.. రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్‌), ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల..

State Bank of India: రాత పరీక్షలేకుండా ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా జాబ్ ..
State Bank Of India
Follow us on

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా.. రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్‌), ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 15, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. షార్ట్‌లిస్టింగ్ కమ్ ఇంటరాక్షన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారు ముంబయి, ఎస్‌బీఐఎల్‌, కోల్‌కతాలో పనిచేయవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఎస్బీఐ మేనేజర్‌ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఎస్బీఐ ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.