SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్, క్లారికల్ కేడర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

| Edited By: Shiva Prajapati

Apr 16, 2021 | 8:32 AM

SBI Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లోని వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న...

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్, క్లారికల్ కేడర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Sbi Recruitment 2021
Follow us on

SBI Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లోని వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న 149 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌, ఫార్మాసిస్ట్‌, మేనేజర్‌, సీనియర్‌ స్పెషల్‌ ఎగ్జి్‌క్యూటివ్‌, డిప్యూటీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, డిప్యూటీ మేనేజర్‌,చీఫ్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌, అడ్వైజర్‌ , డేటా అనలిస్ట్‌ లాంటి పోస్టులు ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా
https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో సంప్రదించవచ్చు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌ 13న ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 3. అయితే కొన్ని ప్రత్యేక కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామకాలు రెగ్యులర్‌ ఉండగా, మరికొన్ని కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 149 (స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్లు)
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేది: మే 23, 2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, వరంగల్‌, హైదరాబాద్‌
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 13, 2021
దరఖాస్తులకు చివరితేది: మే 3, 2021
వెబ్‌సైట్‌:https://www.sbi.co.in/

ఇవీ కూడా చదవండి: NEET Exam Postponed విద్యా రంగాన్ని కుదిపేస్తోన్న కరోనా.. నీట్‌ పరీక్ష కూడా వాయిదా..

త్వరలోనే టీఎస్​పీఎస్సీ పాలకవర్గం ఏర్పాటు..! సభ్యులుగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయంటే..?