SBI Prelims Results: ఎస్‌బీఐ పీవో/ఐబీపీఎస్ ప్రిలిమ్స్‌-2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1,673 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జనవరి 17న విడుదలయ్యాయి..

SBI Prelims Results: ఎస్‌బీఐ పీవో/ఐబీపీఎస్ ప్రిలిమ్స్‌-2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
SBI PO and IBPS SO Prelims 2022 Results

Updated on: Jan 18, 2023 | 11:32 AM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1,673 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జనవరి 17న విడుదలయ్యాయి. గత ఏడాది డిసెంబర్‌ 17, 18, 19, 20 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఎస్‌బీఐ ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ లో రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్‌ తెలుసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది.

మరోవైపు ఐబీపీఎస్ ఎస్‌వో ప్రిలిమ్స్‌-2022 ఫలితాలు కూడా మంగళవారం విడుదలయ్యాయి. వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్‌ 24, 31 తేదీల్లో నిర్వహించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.