SBI Clerk Prelims 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ప్రిలిమ్స్ 2021 పరీక్ష ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్ష షిల్లాంగ్, అగర్తాలా, ఔరంగాబాద్, నాసిక్‌లలో జరగాల్సిన పరీక్ష కరోనా కారణంగా వాయిదా పడింది. మిగతా కేంద్రాలలో కొనసాగనుంది. అయితే ఇతర కేంద్రాల నుంచి ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 10,11,12 దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో కొనసాగనుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
కాగా, అభ్యర్థులలు తమ అడ్మిట్ కార్డును ముందుగానే డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. పరీక్ష సమయానికి కనీసం 90 నిమిషాల ముందు కేంద్రాలకు చేరుకోవాలి. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఎలాంటి గాడ్జెట్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించరు.
అభ్యర్థులు మాస్క్, హ్యాండ్ శానిటైజర్స్, వాటర్ బాటిల్స్ ఎవరికి వారు తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలలో సామాజిక దూరం తప్పనిసరి. మాస్క్‌లేకుండా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అనుమతి ఉండదు. అలాగే పరీక్ష కేంద్రం వద్ద ప్రతి అభ్యర్థికి థర్మల్ స్కానింగ్ ఉంటుంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని పరీక్ష రాసేందుకు అనుతించరు.