SBI Clerk Admit card: ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) జూనియర్‌ అసోసియేట్ క్లర్క్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలపే నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జనవరి 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌ అనంతరం ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్ష జరుగుతుంది..

SBI Clerk Admit card: ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే
SBI Clerk Admit card

Updated on: Dec 27, 2023 | 12:56 PM

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) జూనియర్‌ అసోసియేట్ క్లర్క్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలపే నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జనవరి 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌ అనంతరం ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్ష జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తం 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌ (క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సర్కిల్‌లో 525 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 50 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్‌ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే జరుగుతాయి.

ప్రిలిమ్స్‌ పరీక్ష విధానం ఇలా..

ప్రిలిమ్స్‌ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ విభాగం నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు ఒక గంట సమయం కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్‌ పరీక్షకు ఎంపికవుతారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే ..

తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.