SBI CBO Recruitment 2022: ఎస్బీఐలో 1422 సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టులకు ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..

|

Oct 20, 2022 | 9:04 AM

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ముంబాయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. 1422 సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో..

SBI CBO Recruitment 2022: ఎస్బీఐలో 1422 సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టులకు ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..
SBI CBO Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ముంబాయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. 1422 సర్కిల్‌ బేస్‌డ్‌ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో 175 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్‌ 7, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్‌ 4, 2022వ తేదీన నిర్వహిస్తారు. హాల్‌ టికెట్లను నవంబర్‌ నెలాఖరులో విడుదల చేస్తారు. ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.63,840లు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పరీక్ష విధానం:

మొత్తం 120 మార్కులకు, 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో 2 గంటల సమయంలో పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌లో 40 మార్కులకు 40 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్‌/ఎకానమీ విభాగంలో 30 మార్కులకు 30 ప్రశ్నలు, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌లో 20 మార్కులకు 20 ప్రశ్నలకు పరీక్ష జరుగుతుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

డిస్క్రిప్టిప్‌ పేపర్:

రెండు ఎస్సేలకు 25 మార్కుల చొప్పున 50 మార్కులకు 30 నిముషాల్లో పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.