ONGC Jobs 2022: నెలకు రూ. లక్షన్నర జీతంతో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. ఎంపిక విధానం ఇదే..

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్‌లోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌.. 62 ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, మెరైన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

ONGC Jobs 2022: నెలకు రూ. లక్షన్నర జీతంతో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. ఎంపిక విధానం ఇదే..
ONGC Maharashtra Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 20, 2022 | 8:34 AM

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్‌లోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌.. 62 ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, మెరైన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐసీడబ్ల్యూఏ గ్రాడ్యుయేషన్‌/ సీఏ/ ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్ష మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 150 మార్కులకుగానూ 3 గంటల సమయంలో నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

  • సంబంధిత విభాగంలో 80 ప్రశ్నలు
  • జనరల్ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలు
  • ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ విభాగంలో 30 ప్రశ్నలు

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.