SSB Sub Inspector Jobs 2023: నెలకు రూ.1,12,400 జీతం.. సశస్త్ర సీమా బాల్‌లో 111 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు.. టెన్త్‌/ఐటీఐ అర్హత

|

May 23, 2023 | 1:43 PM

భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 111 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

SSB Sub Inspector Jobs 2023: నెలకు రూ.1,12,400 జీతం.. సశస్త్ర సీమా బాల్‌లో 111 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు.. టెన్త్‌/ఐటీఐ అర్హత
Sashastra Seema Bal
Follow us on

భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 111 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎస్సై (పయనీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, కమ్యూనికేషన్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, ఎస్సై (స్టాఫ్ నర్సు) పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు మధ్య వయసు ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు (జూన్ 18, 2023) దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.200లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు..

  • ఎస్సై (పయనీర్) పోస్టులు: 20
  • ఎస్సై (డ్రాఫ్ట్స్‌మ్యాన్) పోస్టులు: 3
  • ఎస్సై (కమ్యూనికేషన్) పోస్టులు: 59
  • ఎస్సై (స్టాఫ్ నర్సు- ఫిమేల్‌) పోస్టులు: 29

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.