Sainik School Kalikiri Jobs: టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ అర్హతతో చిత్తూరులోని కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా

|

Apr 03, 2022 | 2:19 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌ (Sainik School Kalikiri).. పీజీటీ ఉద్యోగాల..

Sainik School Kalikiri Jobs: టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ అర్హతతో చిత్తూరులోని కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా
Sainik School Kalikiri
Follow us on

Sainik School Kalikiri Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌ (Sainik School Kalikiri).. పీజీటీ ఉద్యోగాల (PGT Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు: పీజీటీ, మెడికల్ ఆఫీసర్‌, ఆర్ట్‌ టీచర్‌, కౌన్సిలర్‌, బ్యాండ్‌ మాస్టర్‌, వార్డెన్‌ ఇతర పోస్టులు.

  • పీజీటీ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ/మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.47,600ల నుంచి రూ.1,51,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • స్కూల్‌ మెడికల్ ఆపీసర్‌ పోస్టులకు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.73,491ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • పీజీటీ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ, పీజీ/మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.62,356ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • పీటీఐ కమ్‌ మార్టన్‌ పోస్టులకు బీపీఈడీ/బీఈఈ/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ58,819ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్ డిగ్రీ (ఫైన్‌ ఆర్ట్స్/ఆర్ట్/డ్రాయింగ్‌/పెయింటింగ్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.58,819ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • కౌన్సిలర్‌ పోస్టులకు ఎంఏ/ఎమ్మెస్సీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.58,819ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • బ్యాండ్‌ మాస్టర్‌ టీచర్‌ పోస్టులకు పంచమర్తిలోని ఏఈసీ ట్రైనింగ్‌ కాలేజీ/నావీ/ఎయిర్‌ఫోర్స్ సంబంధిత బ్యాండ్‌/మేజర్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకున్నవారు అర్హులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.38,252ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • హార్స్ రైడింగ్‌ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.38,252ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.38,252ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.500

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AVNL Avadi Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో నెలకు రూ.లక్షజీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా..