ARDO Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2659 కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్! అర్హతలివే..
డిజిటల్ శిక్షా అండ్ రోజ్‌గార్ వికాస్ సంస్థాన్ ఇండియ (DSRVS)కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్.. దేశ వ్యాప్తంగా అసిస్టెంట్ రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల..
ARDO Assistant Rural Development Officer Recruitment 2022: డిజిటల్ శిక్షా అండ్ రోజ్‌గార్ వికాస్ సంస్థాన్ ఇండియ (DSRVS)కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్.. దేశ వ్యాప్తంగా అసిస్టెంట్ రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల (Assistant Rural Development Officer) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 2659
ఖాళీల వివరాలు: అసిస్టెంట్ రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: ఇంటర్‌తోపాటు ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా చేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 90 నిముషాల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ 1/3 మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.500 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.350
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: