SAIL Recruitment 2021: కరోనా సమయంలో పలు సంస్థలు డాక్టర్లు, నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) డాక్టర్, నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు జార్ఖండ్‌లోని బొకారో జనరల్ ఆసుపత్రిలో సేవలు అందించాల్సి ఉంటుంది.
* ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
* మొత్తం 60 పోస్టుల్లో 30 డాక్టర్, 30 నర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు.
* డాక్టర్ పోస్టు కోసం అప్లై చేసుకునే వారు ఎంబీబీఎస్ లేదా అంతకు మించి అర్హతను కలిగి ఉండాలి.
* నర్సు పోస్టులకు అప్లై చేసుకునే వారు బీఎస్సీ, నర్సింగ్, ఇంటర్‌తోపాటు జీఎన్ఎంలలో ఏదో ఒక దానిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు మే 3 నుంచి 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
* ఎంపికైన డాక్టర్లకు రోజుకు రూ.5000 చొప్పున వేతనం అందిస్తారు.(8 గంటల డ్యూటీ)
* నర్సులకు రోజుకు రూ. 1000 అందిస్తారు. (8 గంటల డ్యూటీ)
* ఈ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిన 30 రోజులకు నియమించుకోనున్నారు.
* ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకువెళ్లాలి.
* పూర్తి వివరాలకు https://www.sail.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Also Read: TS PGECET 2021: తెలంగాణ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?
NHAI Recruitment 2021: గేట్ స్కోర్ ఆధారంగా ఎన్‌హెచ్ఏఐలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..