SAIL Durgapur Steel Plant Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL)కి చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (Durgapur Steel Plant,) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు
మొత్తం ఖాళీలు: 24
1. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు: 16
అర్హతలు: అభ్యర్ధులు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పే స్కేల్: రూ. 70,000లు నెల జీతంగా చెల్లిస్తారు.
2. స్పెషలిస్టు: 8
విభాగాలు: గైనకాలజీ అండ్ అబెస్టెట్రిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, పబ్లిక్ హెల్త్, ఆక్యుపేషన్ హెల్త్, రేడియాలజీ, చెస్ట్ అండ్ టీబీ.
అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్:
పీజీ డిప్లొమా అభ్యర్ధులకు రూ. 90,000
పీజీ డిగ్రీ అభ్యర్ధులకు రూ.1,20,000
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి9 నుంచి 11, 2022 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
అడ్రస్: Office of ED (M&HS), DSP Main Hospital, Durgapur, Paschim Bardhaman- 713205
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: