SAI Recruitment 2023: ఒలింపిక్స్‌లో పాల్గొన్నవారికి జాబ్స్.. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..

|

Apr 12, 2023 | 9:27 PM

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌).. ఒప్పంద ప్రాతిపదికన 12 మేనేజర్‌ (అథ్లెట్‌ రిలేషన్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

SAI Recruitment 2023: ఒలింపిక్స్‌లో పాల్గొన్నవారికి జాబ్స్.. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..
Sports Authority Of India
Follow us on

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌).. ఒప్పంద ప్రాతిపదికన 12 మేనేజర్‌ (అథ్లెట్‌ రిలేషన్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా (స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్‌లో పాల్గొని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 28, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రాతపరీక్షలేకుండా నేరుగా అకడమిక్‌ మెరిట్, స్పోర్ట్స్ అర్హతలు, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు సమయంలో రూ.700లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.45,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.