దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాలకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) సికింద్రాబాద్ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు లెవల్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 12 నుంచి 22 వరకు పీఈటీ (శారీరక సామర్థ్య పరీక్షలు) పరీక్షలు జరిగాయి. వీటిల్లో దాదాపు 9,303 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు.
పీడబ్ల్యూడీ విభాగంలో 100 మంది, సీసీఏఏ విభాగంలో 987 మంది, ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగంలో 55, నాన్ పీడబ్ల్యూడీ విభాగంలో 8,161 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరందరికీ ఫిబ్రవరి 7 నుంచి మెడికల్ టెస్టులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలు, కాల్‌లెటర్ వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచున్నట్లు ఆర్‌ఆర్‌సీ తన ప్రకటనలో తెల్పింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.