RRC Secunderabad Jobs: సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

|

Dec 29, 2024 | 6:47 AM

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్‌సీఆర్‌ యూనిట్ పరిధిలోని పలు ప్రదేశాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు, ఎంపిక విధానం ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

RRC Secunderabad Jobs: సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
RRC Secunderabad
Follow us on

దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 4,232 ఎస్‌సీఆర్‌ వర్క్‌షాప్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా చూస్తూ.. ఎస్సీ- 635, ఎస్టీ- 317, ఓబీసీ- 1143, ఈడబ్ల్యూఎస్‌- 423, యూఆర్‌- 1714 చొప్పున ఉన్నాయి. ఎస్‌సీఆర్‌ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు జనవరి 27, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌సీఆర్‌ యూనిట్ ప్రదేశాలు ఏమేం ఉన్నాయంటే.. సికింద్రాబాద్, లల్లాగూడ, మెట్టుగూడ, ఖాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్‌, నాందెడ్‌, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్‌.

ట్రేడుల వారీగా అప్రెంటీస్‌ ఖాళీల వివరాలు..

  • ఏసీ మెకానిక్ ఖాళీల సంఖ్య: 143
  • ఎయిర్ కండిషనింగ్ ఖాళీల సంఖ్య: 32
  • కార్పెంటర్ ఖాళీల సంఖ్య: 42
  • డీజిల్ మెకానిక్ ఖాళీల సంఖ్య: 142
  • ఎలక్ట్రానిక్ మెకానిక్ ఖాళీల సంఖ్య: 85
  • ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఖాళీల సంఖ్య: 10
  • ఎలక్ట్రీషియన్ ఖాళీల సంఖ్య: 1053
  • ఎలక్ట్రికల్ (ఎస్‌&టి) (ఎలక్ట్రీషియన్) ఖాళీల సంఖ్య: 10
  • పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్) ఖాళీల సంఖ్య: 34
  • ట్రైన్‌ లైటింగ్ (ఎలక్ట్రీషియన్) ఖాళీల సంఖ్య: 34
  • ఫిట్టర్ ఖాళీల సంఖ్య: 1742
  • మోటార్ మెకానిక్ వెహికల్ (ఎంఎంవీ) ఖాళీల సంఖ్య: 8
  • మెషినిస్ట్ ఖాళీల సంఖ్య: 100
  • మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం) ఖాళీల సంఖ్య: 10
  • పెయింటర్‌ ఖాళీల సంఖ్య: 74
  • వెల్డర్ ఖాళీల సంఖ్య: 713

ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి డిసెంబర్‌ 28, 2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంది. ఆసక్తి కలిగిన వారు జనవరి 27, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.