
సెంట్రల్ రైల్వేలో.. కల్చరల్ కోటాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద ప్రికాషన్ ఇనుస్ట్రుమెంట్ ప్లేయర్, క్లాసికల్ సింగర్ మేల్/ఫీమేల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు దారుల వయోపరిమితి 2026 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1996 జనవరి 2 నుంచి 2008 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వితంతు, విడాకులు తీసుకున్న మహిళలకు 35 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 30, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 50 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, మ్యూజిక్, సింగింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 35 మార్కులకు ప్రాక్టికల్ డిమాన్ స్ట్రేషన్ విధానంలో పరీక్ష ఉంటుంది. మిగిలిన 15 మార్కులకు అవార్డులు, సర్టిఫికెట్లు ఇతర విషయాలకు కేటాయిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.