RRB RPF 2025 Exam: మరికాసేపట్లో ఆర్‌ఫీఎఫ్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షలు ప్రారంభం.. ఆఖరి నిమిషంలో ఈ తప్పులొద్దు

రైల్వేశాఖ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న ఆర్‌పీఎఫ్‌, ఆర్‌పీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి రైల్వే శాఖ అడ్మిట్‌ కార్డులను కూడా ఇప్పటికే విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

RRB RPF 2025 Exam: మరికాసేపట్లో ఆర్‌ఫీఎఫ్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షలు ప్రారంభం.. ఆఖరి నిమిషంలో ఈ తప్పులొద్దు
RRB RPF 2025 Exam

Updated on: Mar 02, 2025 | 6:52 AM

హైదరాబాద్‌, మార్చి 2: రైల్వే శాఖ ఆధ్వర్యంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) పరీక్షలు ఈ రోజు (మార్చి 2) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి రైల్వే శాఖ అడ్మిట్‌ కార్డులను కూడా తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మార్చి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

కాగా మొత్తం 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌బీ ఆర్‌ఫీఎఫ్‌ కానిస్టేబుల్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకు 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. అలాగే తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కుల కోత విధిస్తారు. ఇక ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు కలపడం, తీసివేయడం ఉండదు. రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) అనంతరం ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు

  • ఫోర్జరీ, మోసం, దుష్ప్రవర్తన, నిషేధిత వస్తువులను ఉపయోగించడం వంటి ఏ రకమైన మోసాలకు పాల్పడినా, పాల్పడినట్లు రుజువైనా RRB ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని పరీక్షలకు హాజరుకాకుండా అభ్యర్థులపై నిషేధం విధించడం జరుగుతుంది.
  • నియామక ప్రక్రియకు సంబంధించి అభ్యర్ధులు అనవసరమైన, అన్యాయమైన మార్గాలను అనుసరిస్తే అటువంటి వారిపై అనర్హతవేటు లేదా డిబార్‌ చేస్తారు.
  • అభ్యర్థులు ముఖ్యమైన వివరణలు, ఇతర సమాచారం కోసం RRB అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే తనిఖీ చేయాలని సూచించారు.
    అభ్యర్థులు CBT/PET/PMTDV/ME సమయంలో ఆన్‌లైన్ దరఖాస్తులో అప్‌లోడ్ చేసిన అదే రంగు ఫోటోగ్రాఫ్ కాపీని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి.
  • పరీక్ష సమయంలో అభ్యర్థులు తమ ఇ-కాల్ లెటర్‌లను, చెల్లుబాటు అయ్యే ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో ఐడి కార్డును తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి.

ఆర్‌ఆర్‌బీ ఆర్‌ఫీఎఫ్‌ కానిస్టేబుల్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.