RRB Group D Exam Date 2025: రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్‌డేట్ చూశారా..

RRB Group D admit card 2025 released, Direct link to download hall ticket here: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల నియామకాలకు మరో మూడు రోజుల్లో..

RRB Group D Exam Date 2025: రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్‌డేట్ చూశారా..
RRB Group D 2025 Exam Admit Cards

Updated on: Nov 24, 2025 | 3:20 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 24: ఇండియన్‌ రైల్వే.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల నియామకాలకు మరో మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌బీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైటలో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈమేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

కాగా ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు నవంబర్‌ 27 నుంచి దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. 2026, జనవరి 16 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. గతంలో విడుదల చేసిన పాత షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 17 నుంచి ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్‌ డి లెవల్ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డి అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.