AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఇండియన్‌ రైల్వేలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల

ఇండియన్ రైల్వేలో.. పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 434 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2 తదితర పోస్టుల భర్తీకి..

RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఇండియన్‌ రైల్వేలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల
Railway Paramedical Staff Job Recruitment
Srilakshmi C
|

Updated on: Aug 09, 2025 | 5:56 AM

Share

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 434 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2, ఫార్మసిస్ట్‌, ఈసీజీ టెక్నీషియన్‌ వంటి పలు పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఆగస్టు 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

పోస్టుల వివరాలు..

  • నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల సంఖ్య: 272
  • డయాలిసిస్‌ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 4
  • హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 33
  • ఫార్మసిస్ట్‌(ఎంట్రీ గ్రేడ్‌) పోస్టుల సంఖ్య: 105
  • రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌రే టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 04
  • ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 4
  • లాబోరేటరీ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 12

అర్హత కలిగిన వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ, డిప్లొమా, టెన్‌+2 లేదా ఫార్మసి, రేడియోగ్రఫి విభాగంలో డిగ్రీ, డీఎంఎల్‌టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి.. 2026 జనవరి 1వ తేదీ నాటికి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకైతే 20 నుంచి 40 ఏళ్లు, డయాలిసిస్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 20 నుంచి 33 ఏళ్లు, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌కు 18 నుంచి 33 ఏళ్లు, ఫార్మసిస్ట్‌కు 20 నుంచి 35 ఏళ్లు, రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌-రే టెక్నీషియన్‌కు 19 నుంచి 33 ఏళ్లు, ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, లాబోరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు తప్పనిసరిగా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 8, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించాలి. ఆ తర్వాత సెప్టెంబర్‌ 11 నుంచి 20 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం ఇస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు నర్సింగ్‌సూపరింటెండెంట్‌ పోస్టులకు రూ.44,900, డయాలిసిస్‌ టెక్నీషియన్‌ పోస్టులకు, హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు రూ.35,400, ఫార్మసిస్ట్‌, రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌-రే టెక్నీషియన్‌ పోస్టులకు రూ.29,200, ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.25,500, లాబోరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.21,700 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర అలవెన్స్‌లు కూడా అందిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్