RRB NTPC Railway Jobs 2025: రైల్వేలో భారీగా గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు

RRB NTPC Graduate Recruitment 2025 Notification: దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద..

RRB NTPC Railway Jobs 2025: రైల్వేలో భారీగా గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు
RRB NTPC Railway Jobs

Updated on: Oct 24, 2025 | 6:26 AM

నిరుద్యోగులకు రైల్వే శాఖ భారీ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,810 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు..

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • అహ్మదాబాద్‌లో పోస్టుల సంఖ్య: 79
  • అజ్‌మేర్‌లో పోస్టుల సంఖ్య: 345
  • బెంగళూరులో పోస్టుల సంఖ్య: 241
  • భువనేశ్వర్‌లో పోస్టుల సంఖ్య: 231
  • బిలాస్‌పూర్‌లో పోస్టుల సంఖ్య: 864
  • చండీగఢ్‌లో పోస్టుల సంఖ్య: 199
  • చెన్నైలో పోస్టుల సంఖ్య: 187
  • గువాహటిలో పోస్టుల సంఖ్య: 56
  • గోరఖ్‌పుర్‌లో పోస్టుల సంఖ్య: 111
  • జమ్ము & శ్రీనగర్లో పోస్టుల సంఖ్య: 32
  • కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 685
  • మాల్దాలో పోస్టుల సంఖ్య: 522
  • ముంబయిలో పోస్టుల సంఖ్య: 596
  • ముజఫర్‌పూర్‌లో పోస్టుల సంఖ్య: 21
  • పట్నాలో పోస్టుల సంఖ్య: 23
  • ప్రయాగ్‌రాజ్‌లో పోస్టుల సంఖ్య: 110
  • రాంచీలో పోస్టుల సంఖ్య: 651
  • సికింద్రాబాద్‌లో పోస్టుల సంఖ్య: 396
  • సిలిగురిలో పోస్టుల సంఖ్య: 21
  • తిరువనంతపురంలో పోస్టుల సంఖ్య: 58

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు మాత్రం డిగ్రీతో పాటు ఇంగ్లిష్ లేదా హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 20, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్, ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్ పోస్టులకు నెలకు రూ.35,400, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.25,500, ఇతర పోస్టులకు రూ.29,200 చొప్పున జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు చెల్లిస్తారు.

రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే తొలి దశ రాత పరీక్ష మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, మ్యాథ్స్‌ విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ విభాగం నుంచి 30 ప్రశ్నలు 30 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 20, 2025.
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్‌ 22, 2025.
  • దరఖాస్తు సవరణ తేదీలు: నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 02 వరకు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.