RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. రైల్వేలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చేసింది

RRB JE Recruitment 2025 Notification: అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి ఇటవీల కాలంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం..

RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. రైల్వేలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చేసింది
RRB JE Recruitment

Updated on: Oct 07, 2025 | 6:22 AM

దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి ఇటవీల కాలంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆర్‌ఆర్‌బీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 31, 2025వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇతర వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల కానుంది. అందులో అర్హతలు, దరఖాస్తు విధానం, విభాగాల వారీగా ఖాళీలు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఎంపిక విధానం, సిలబస్‌, రాత పరీక్ష తేదీలు వంటి ఇతర పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. తాజాగా ఇందుకు సంబంధించిన షార్ట్‌ నోటీస్‌ను ఆర్ఆర్‌బీ విడుదల చేసింది.

ఇందులో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబర్‌ 31, 2025 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్‌ 30, 2025వ తేదీ వరకు దరఖాస్తు విధానం కొనసాగుతుంది. ఎంపికై వారికి నెలకు రూ.35,400 నుంచి ప్రారంభ వేతనం ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.