RITES Recruitment 2021: సివిల్, మెకానికల్‌పాసై ఉద్యోగం కోసం చూస్తున్నారా.. మంచి జీతంతో ఉద్యోగావకాశాలు..

|

Aug 05, 2021 | 10:28 AM

RITES Recruitment 2021 : ఇంజనీరింగ్ పాసై.. మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన గురుగావ్ లోని రైట్స్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగ నియామకం చేపట్టింది..

RITES Recruitment 2021: సివిల్, మెకానికల్‌పాసై ఉద్యోగం కోసం చూస్తున్నారా.. మంచి జీతంతో ఉద్యోగావకాశాలు..
Rites Limited
Follow us on

RITES Recruitment 2021 : ఇంజనీరింగ్ పాసై.. మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన గురుగావ్ లోని రైట్స్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగ నియామకం చేపట్టింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఉద్యోగం గురించి మరిన్ని వివరాలతో పాటు దరఖాస్తు కోసం ttps://drive.google.com/file/d/1vLKvLxI9iobGcfLnanAo9AVueeUjufaJ/view
సందర్శించాల్సి ఉంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. సంబంధిత పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగష్టు 25, 2021

ఉద్యోగం గురించి వివరాలు:

జాబ్ రోల్ : ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌
మొత్తం ఖాళీలు : 48
పనిచేయాల్సిన విభాగాలు : సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌.
విద్యార్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత అయ్యి ఉండాలి.
అనుభవం: సంబంధిత ఉద్యోగంలో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత
వయస్సు : 32 ఏళ్ళు గరిష్ట పరిమితి
వేతనం : నెలకు రూ. 45,000 – రూ. 1,50,000
ఎంపిక విధానం: పని అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
మొత్తం 100శాతానికి గాను రాత పరీక్షకి 60శాతం, ఇంటర్వ్యూకి 35శాతం , అనుభవానికి 5శాతం వెయిటేజిని కేటాయించారు.
దరఖాస్తు ఫీజు : ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు

Also Read: Indian Hockey: ఒలింపిక్స్‌లో భారత హాకీ ప్రయాణం.. వరసగా 6 గోల్స్ మెడల్స్‌తో స్వర్ణయుగం నుంచి పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణ వరకూ..