ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ మిగిలిన సీట్లకు ప్రవేశాలు కల్పించడానికి నవంబర్ 14న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వీసీ ప్రొఫెసర్ కేసీరెడ్డి తెలిపారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం.. ఈ నాటులు ట్రిపుల్ ఐటీల్లో క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న 266 సీట్లను నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిల్లో రెండు ఫేజ్‌లలో జరిగిన కౌన్సెలింగ్‌లలో దాదాపు 206 సీట్లు మిగిలిపోయాయి. ఇవికాకుండా ఈ నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ఎన్‌సీసీ కోటాలో 40 సీట్లు, స్పోర్ట్స్ కోటాలో 20 సీట్లు ఉన్నాయి.
ఈ నెల 14న నిర్వహించనున్న కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు నవంబర్ 6వ తేదీలోగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నవంబర్ 9వ తేదీన ఎంపికైన వారి లిస్ట్ విడుదల చేస్తారు. అనందరం14వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్లతోపాటు ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. కాగా ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో అక్టోబర్ 17వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.