భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలోనున్న రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ.. పర్చేజ్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్, జూనియర్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్ 14, 2022వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు నవంబర్ 14, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష (టైర్-1, టైర్-2, టైర్-3) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: THE DIRECTOR, RAJIV GANDHI CENTRE FOR BIOTECHNOLOGY, POOJAPPURA, THYCAUD P.O, THIRUVANANTHAPURAM 695014, KERALA.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.