Andhra Pradesh: దసరా సెలవులు అప్పటినుంచే.. 2024-25 అకడమిక్ క్యాలెండర్ పూర్తి వివరాలివే..

|

Jul 30, 2024 | 5:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ 2024-25 అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పని చేయనుండగా అన్ని రకాలు కలిపి 83 సెలవులు ఉన్నాయి.

Andhra Pradesh: దసరా సెలవులు అప్పటినుంచే.. 2024-25 అకడమిక్ క్యాలెండర్ పూర్తి వివరాలివే..
AP School Holidays 2024
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ 2024-25 అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పని చేయనుండగా అన్ని రకాలు కలిపి 83 సెలవులు ఉన్నాయి.

ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి..

ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి.

రెండు విభాగాలకు చివరి పీరియడ్ ను క్రీడలకు ఐచ్ఛికంగా పేర్కొన్నారు.

ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి.

పండుగ సెలవులు ఇవే..

దసరా సెలవులు: 04-10-2024 నుంచి 13-10-2024 వరకు..

క్రిస్మస్ సెలవు: 25-12-2024 – క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఇస్తారు..

సంక్రాంతి సెలవులు: 10-01-2025 నుండి 19-01-2025 వరకు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయి..

ఫార్మెటివ్ – సమ్మెటివ్ పరీక్షలు

ఫార్మెటివ్ -1 (సీబీఏ 1 -8) ఆగస్టు 27 నుంచి 31 వరకు

ఫార్మెటివ్ -2 అక్టోబర్ 21 నుంచి 25 వరకు

సమ్మెటివ్ -1 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు

ఫార్మెటివ్ -3 (సీబీఏ2) జనవరి 27 నుంచి 31

పదో తరగతి ప్రీఫైనల్ ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు

ఫార్మెటివ్ -4 మార్చి 3 నుంచి 7 వరకు

సమ్మెటివ్ 2 (సీబీఏ 3) ఏప్రిల్ 7 నుంచి 17 వరకు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

శ్రీశైలం డ్యామ్ గెట్లు ఎత్తివేత.. వీడియో..